ఫిజిక‌ల్ హ్యాండిక్యాపెడ్ పాత్ర‌ల్లో హీరోయిన్లు.. ఈ మార్పు చాలా అవ‌స‌రం!

-

హీరోయిన్లంటే గ్లామ‌ర్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. అందం, అభిన‌యంతో అభిమానుల్లో గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేస్తుంటారు. మ‌రి ఎంత‌సేపు సినిమాల‌కు గ్లామ‌ర్ డోస్ అందించ‌డ‌మేనా.. క‌థ బ‌లంగా ఉంటే ఏ పాత్ర‌యినా చేస్తామ‌ని నిరూపిస్తున్నారు. ముఖ్యం హ్యాండిక్యాపెడ్ పాత్ర‌ల్లో చేస్తూ వారిలో ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలామంది హీరోయిన్లు ఈ బాట‌లో ప‌య‌నించారు.

అనుష్క శెట్టి నిశ్శ‌బ్ధం సినిమాలో మూగ అమ్మాయిగా నటించి మెప్పించింది. హ్యాండిక్యాపెడ్ వాళ్లు ఎందులోనూ త‌క్కువ కాద‌ని నిరూపించింది. అటు న‌య‌న తార కూడా నెట్రిక‌న్ సినిమాలో క‌ళ్లులేని అమ్మాయిగా క‌నిపించింది.

అటు పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా డిస్కోరాజా మూవీలో మూగ అమ్మాయి పాత్ర‌లో న‌టించి మెప్పించింది. వీరే కాదు స‌మంత కూడా స‌న్నాఫ్ స‌త్య‌నారాయ‌ణ సినిమాలో షుగ‌ర్ పేషెంట్ గా త‌న మార్కును చూపించింది. అలాగే అఆ సినిమాలో ప్రెష‌ర్ ఎక్కువ‌గా ఉండే అమ్మాయిగా న‌టించి మెప్పించింది. ఇలా హీరోయిన్లు లోపాలున్న పాత్ర‌లు చేయ‌డం చాలా అవ‌స‌రం. ఎందుకంటే అలాంటి వారిలో ధైర్యం నింపిన‌ట్టు అవుతోంది. వాళ్లు ఎందులోనూ త‌క్కువ కాద‌ని, అంద‌రిలాగే హాయిగా జీవించొచ్చ‌ని తెలుపుతాయి ఇలాంటి సినిమాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version