నోటి దుర్వాసనని పోగొట్టే ఇంట్లో దొరికే వస్తువులేమిటో తెలుసుకుందాం.

-

నోటి దుర్వాసనకి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది పళ్ళని శుభ్రంగా ఉంచుకోకపోవడమే. నోరు బాగుంటేనే శరీర ఆరోగ్యం బాగుంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం తిన్న ఆహారం పళ్ళలో ఇరుక్కుని, దానిపై బాక్టీరియా పెరిగితే నోరు దుర్వాసన వస్తుంది. అందుకే ప్రతీ ఆరు నెలలకి ఒకసారయినా దంత వైద్యుడిని సంప్రదించాలని చెబుతుంటారు. ప్రస్తుతం మన ఇంట్లో దొరికే వస్తువుల ద్వారా నోటి దుర్వాసనని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడకం తగ్గించాలి. అందులో సల్ఫర్ శాతం నోటి దుర్వాసనకి కారణం అవుతుంది.

ఫైనాపిల్ జ్యూస్

చాలామంది ఫైనాఫిల్ జ్యూస్ తాగితే నోటి దుర్వాసన తగ్గిపోతుందని నమ్ముతారు. దీనివెనకాల శాస్త్రీయమైన నిరూపణ సరిగ్గా లేకపోయినప్పటికీ అన్నం తిన్న తర్వాత ఒక గ్లాసు ఫైనాపిల్ జ్యూస్ తాగితే సరిపోతుంది.

నీళ్ళు

నోరెండిపోవడం దుర్వాసనకి కారణం నాలుక మీద లాలాజలం ఉత్పత్తి కాకపోతే నోరు దుర్వాసనకి గురవుతుంది. అందుకే నోటినెప్పుడూ తేమగా ఉంచడానికి కావాల్సినన్ని నీళ్ళు ఖచ్చితంగా తాగాలి.

పెరుగు

పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా ఉంటుంది. ఇది చెడు వాసనని చంపేస్తుంది. ఒకానొక పరిశోధన ప్రకారం కొంత మందిపై కొన్ని రోజులు పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని కనుక్కున్నారు.

పాలు

పాలల్లో ఉండే పోషకాలు చెడు వాసనని దూరం చేస్తాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి పదార్థాలు గల ఆహారాలని తీసుకున్నప్పుడు ఒక గ్లాసు పాలు తాగితే చెడు వాసన దూరమవుతుంది.

సోంఫు

అన్నం తిన్న తర్వాత సరిగ్గా జీర్ణమవ్వాలని సోంఫు తినే అలవాటున్న వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. నోటి దుర్వాసనని సోంఫు దూరం చేస్తుంది. అందులో ఉండే సువాసన నోటిలోని దుర్వాసనని దూరం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news