నిమ్మతొక్కతో ఎన్ని లాభాలో.. పిండేసి పారేస్తున్నారా..?

-

నిమ్మ కాయ అంటేనే.. ఔషదాల గని..రసంతో ఆరోగ్యానికి, అందానికి రెండు విధాలుగా లాభాలు.. అయితే రసం పిండేసిన నిమ్మకాయలను చాలామంది పడేస్తుంటారు. కొంతమంది అయితే.. వాటితో షింక్ క్లీన్ చేస్తారు. కానీ నిమ్మతొక్కలను ఇప్పుడు చెప్పుకునే విధాంగా వాడుకుంటే.. బోలెడు లాభాలు పొందవచ్చు. అవేంటో చూద్దామా..!
నిమ్మతొక్కలు కాస్త చేదుగా ఉంటాయి. కనుక వాటిని నేరుగా తినలేరు. అప్పుడు నిమ్మ తొక్కలను ఎండ బెట్టి పొడి చేసి ఉపయోగించుకోవచ్చు. నిమ్మతొక్కల పొడిని ఆహార పదార్ధాల్లో కానీ, జ్యూస్(Lemon Juice) రూపంలో తీసుకోవచ్చు..నిమ్మ తొక్కల‌ను టీ(Lemon Tea) గా కూడా చేసుకుని తాగుతారు.
నిమ్మ తొక్కల్లో నిమ్మర‌సం కంటే కూడా అధికంగా పోషకాలు ఉంటాయి. ఇక విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, డి-లైమోనీన్‌, బీటా కెరోటిన్, సిట్రిక్ యాసిడ్‌, మాలిక్ యాసిడ్‌, హెస్పెరిడిన్ వంటి అనేక పోషకాలున్నాయి. నిమ్మతొక్కల్లో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం కూడా అధికమే..
నిమ్మతొక్కలు డి-లైమోనీన్ శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి. దీంతో వాపులు తగ్గుతాయి.
నిమ్మతొక్కల్లో ఉండే పొటాషియం హైబీపీని త‌గ్గిస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో గుండె జ‌బ్బులను నివారిస్తుంది.
నిమ్మకాయ‌లకు సువాసన ఇచ్చే.. డి-లైమోనీన్ సమ్మేళనం.. యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. దీనివలన రోగ నిరోధక శక్తినిస్తుంది.
ఇక నిమ్మ తొక్కల పొడిలో క్యాన్సర్ క‌ణాలను నాశనం చేసే గుణాలున్నాయి. అంతేకాదు డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులను నివారిస్తుంది.
తెల్ల రక్త కణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నవారికి దివ్య ఔషధం నిమ్మతొక్కలు. నిమ్మతొక్కల్లో ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో యాంటీ బాడీల‌ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
కాబట్టి తొక్కే కదా అని చీప్ గా చూడకండి.. ఇలా వాడుకుంటే.. మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. కాకపోతే కాస్త ఓపిక ఉండాలి. ఎండపెట్టాలి, పొడి చేయాలి అంటే టైమ్ పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version