మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దేవర డిస్ట్రిబ్యూషన్ హక్కుల మొత్తం రూ.110 కోట్లు ఉండవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా థ్రియేటికల్ హక్కులను ఆంధ్ర ప్రదేశ్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకోగా.. తెలంగాణాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ హక్కుల విలువ రూ.110 కోట్లు కాగా.. ఓవర్సీస్ హక్కులు మరో రూ.27 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌లను రిలీజ్ చేయగా….. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.తారక్ ఈ మూవీ లో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.