ఎంత పనిచేసావ్.. మెట్రో డ్రైవరన్న.. కుటుంబానికి దిక్కెవరు..

-

కొన్ని కొన్ని సార్లు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు.. తీర్చలేని నష్టాన్ని కాగజేస్తాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో.. సామాన్యుడి నుంచి సంపనుడి వరకు ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారిపై కరోనా ప్రభావం అధికంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే.. కరోనా ధాటికి ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతే.. మరి కొంత మంది వారికి వచ్చే జీతం సరిపోక.. అప్పుల పాలు చేసింది. అయితే కరోనా సమయంలో చేసిన అప్పులు మెడకు ఉరితాడులా బిగిసి.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని గోల్నాకలో నివసించే తుంకి సందీప్‌రాజ్ (25) నాగోలులో మెట్రో రైలు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక పోవడంతో.. మనోవేదనకు గురైన సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శనివారం సాయంత్రం తల్లికి ఫోన్ చేసి తాను ఈ రోజు రాత్రి మియాపూర్ డిపోలోనే ఉండిపోతానని చెప్పిన సందీప్ రాజ్.. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం చెరువులో మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. సందీప్ మరణ వార్త విన్న అతడి తల్లి గుండెలు అవిసేలా ఏడ్చింది. కాగా, తాను శనివారం ఆత్మహత్య చేసుకుంటున్నట్టు స్నేహితుడు వెంకటేష్‌కు సందీప్ చేసిన వాట్సాప్ మెసేజ్‌ను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version