హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మరో రైలు..?

-

కేంద్రం మరో వందేభారత్ రైలుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదట సికింద్రాబాద్వి నుండి శాఖ మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన కేంద్రం, ఈ నెల 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఇంకో వందేభారత్ రైలును పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.

Chennai-Coimbatore Vande Bharat Express To Be Flagged Off On April 8 | What  To Expect | India News, Times Now

ఈ నేపథ్యం లో, హైదరాబాదు నుంచి బెంగళూరుకు మరో వందేభారత్ రైలు నడిపే ఆలోచన ఉన్నట్టు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ స్థానిక బీజేపీ నేతలతో అన్నట్టు సమాచారం. ఇది కార్యరూపం దాల్చితే హైదరాబాద్ నగరం నుంచి మూడు వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నట్టవుతుంది.

ఇప్పటికే హైదరాబాద్-బెంగళూరు మధ్య పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. 570 కిమీ దూరాన్ని అవి 11 గంటల వ్యవధిలో పూర్తి చేపడుతున్నాయి. అదే వందేభారత్ రైలు మాత్రం కేవలం 7 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు.
కాగా, ఈ రైలును కాచిగూడ నుంచి నడుపుతారని గత జనవరిలోనే వార్తలు వినిపించాయి. అంతేకాదు, సికింద్రాబాద్ నుంచి పూణే నగరానికి వందేభారత్ సెమీ హైస్పీడ్ రైలు నడిపే అవకాశాలు కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news