అమరావతి సమీపంలో పెద్ద కొర్రపడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ల మధ్య సవాళ్ల ఘర్షణలో పోలీసులపై, ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం అంజద్ బాషా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘర్షణ వాతావరణం నివారించేందుకు పోలీసులు కొందరిని మిస్ హ్యాండిల్ చేశారని తప్పుడు ప్రచారం జరుగుతోంది..ఒక ముస్లిమ్ యువకుడినీ గాయపరిచారని వేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం.. ఇది శాంతి భద్రతల పరిరక్షణ సందర్భంలో కొంత అతిగా ప్రవర్తించి ఉండవొచ్చు.. ఘర్షణ నివారణలో ఎవరినైనా నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు.. మతాన్ని చూసి, కులాన్ని చూసి పోలీసులు చర్యలు తీసుకోరు.. ఒక మతం వారి పట్ల ఇలా చేశారని చెప్పడం దారుణం.. చంద్రబాబు, ఆయనకు మద్దతు తెలిపే పత్రికలు మత రాజకీయాలు చేస్తున్నాయి.
మైనార్టీలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వాలు చూశాం.. చివరకు ఉత్తరప్రదేశ్ లో కూడా మైనారిటీ కి అవకాశం కల్పించారు..కానీ చంద్రబాబు తన మంత్రి వర్గంలో ఒక్క మైనారిటీ కైనా అవకాశం కల్పించారా.. గుంటూరులో నారా-హమారా కార్యక్రమంలో ప్ల కార్డు ప్రదర్శించిన ముస్లీం యువకులపై దేశ ద్రోహం పెట్టిన విషయం మరచిపోయారా.. మైనార్టీలకు అనగదొక్కెలా ప్రవర్తించిన చంద్రబాబు గురించి ఆ పత్రికలు ఎందుకు రాయలేదో చెప్పాలి.. వైసిపి మైనారిటీల పక్ష పాత ప్రభుత్వం.. దేశంలో తొలిసారి మైనారిటీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్ ది.. నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం మైనార్టీలకు పెద్ద పీట వేసినది.. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది.. ఈ విషయాలను ప్రతిపక్ష నేతలు, ఆ పత్రికకు ఎందుకు చెప్పావు ఆన్న ది ప్రజలు అర్థం చేసుకోవాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.