హైపోథైరాయిడిజం అంటే ఏమిటి..? కారణాలు, చికిత్స, జీవన విధానంలో మార్పులు ఇలా ఎన్నో తెలుసుకోండి..!

-

హైపోథైరాయిడిజం మన మెడ యొక్క ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో గ్రంధి. దీని పని ఏమిటంటే జీవక్రియ శక్తి ఉత్పత్తి మరియు మానసిక నియంత్రణ హార్మోన్లని ఉత్పత్తి చేయడం. థైరాయిడ్ గ్రంథి పనికి సంబంధించిన ప్రధాన సమస్యలు ఉంటే థైరాయిడ్ హార్మోన్లు అతి ఎక్కువగా లేదా అతి తక్కువగా ఉత్పత్తి చేయడం.అయితే పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఇది ఉంటుంది.

హైపోథైరాయిడిజం /Hypothyroid symptoms
హైపోథైరాయిడిజం /Hypothyroid symptoms

హైపో థైరాయిడ్ లక్షణాలు:

బరువు తగ్గడం
ఆందోళన
చికాకు
మానసిక ఇబ్బందులు
బలహీనత
హార్ట్ బీట్ పెరిగిపోవడం
మెడ మీద వాపు కలగడం
వేడికి సున్నితత్వం

ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించలేరు. వృద్ధ మహిళలలో హైపోథైరాయిడిజం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఎవరికైనా ఇది వచ్చే అవకాశం వుంది.

హైపోథైరాయిడిజాన్ని ఎలా తగ్గించుకోవాలి..?

మందులు వున్నాయి. కానీ పూర్తిగా నయం కాదు. మీరు మీ వైద్యుడిని క్రమం తప్పకుండా కన్సల్ట్ చేస్తూ ఉండాలి. T3, T4, TSH పరీక్షలు తీసుకొని మోతాదును తగ్గించమని లేదా పెంచమని చెబుతారు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా మీకు బాగా సహాయపడుతుంది. వాటిని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం వలన మీరు మరింత స్ట్రాంగ్ గా అవుతారు. అలానే మీ శరీరాన్ని బట్టి మీరు వ్యాయామం చేయడం మంచిది. ఎంతసేపు వ్యాయామం చేయాలి, ఎటువంటి వ్యాయామాలు చేయాలి వంటివి కూడా మీరు డాక్టర్ని అడిగి చేయడం కూడా మంచిది.

అదే విధంగా ఒత్తిడికి గురి కాకుండా యోగా, మెడిటేషన్, వ్యాయామాలు చేస్తే మంచిది. మ్యూజిక్ వల్ల కూడా మీరు రిలాక్స్డ్ గా ఉండొచ్చు. దీని వలన కూడా ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి వీటిని కూడా పాటించడం మంచిది.

అదే విధంగా మంచి పోషకాహారం తీసుకోవడం మంచిది. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. బ్రోకలీ, కాలీఫ్లవర్, మొలకలు తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ కలుగుతుంది.

మంచి నిద్ర కూడా దీనికి బాగా ఉపయోగపడుతుంది. మీరు మీ ఎలక్ట్రానిక్ డివైస్లని నిద్ర పోవడానికి రెండు గంటల ముందే ఆపేసి నిద్ర పోవడం మంచిది దీనితో మీరు రిలాక్స్డ్ గా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news