‘నాగకన్యను నేను.. గుడికట్టండి..’ కరీంనగర్‌ జిల్లాలో యువతి వింత ప్రవర్తన..!!

-

5జీ కాలంలో కూడా మంత్రతంత్రాలను, మూఢనమ్మకాలను ఇంకా నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. అతీత శక్తులు ఉన్నాయి.. అవి మనల్ని ప్రభావితం చేస్తాయి అని బలంగా విశ్వసించేవాళ్లు ఉన్నారు.. కరీంనగర్ జిల్లాలో మాత్రం ఓ వింత సంఘటన స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. సైదాబాద్ మండలానికి చెందిన ఓ యువతి తాను నాగకన్యనని చెప్తోంది.. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అవుతోంది. ఎందుకు ఆ యువతి అలా చేస్తోంది..స్థానికులు ఆమె మాటలను నమ్ముతున్నారు.
ఎగ్లాస్పూర్‌కి చెందిన కృష్ణవేణి అనే యువతికి డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత కొంతకాలం ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా చేసింది. ఈ మధ్యనే కృష్ణవేణి తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆమె కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే యువతి తన నాయనమ్మ దగ్గర ఉంటోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్న కృష్ణవేణి తాను నాలుగేళ్ల క్రితమే నాగకన్యగా మారిపోయాని చెబుతోంది. అంతే కాదు ప్రతిరోజూ గ్రామ శివారులో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేయడం. అక్కడే నాగుపాములా డ్యాన్స్ చేయడం లాంటివి చేస్తున్న కృష్ణ వేణిని చూసి గ్రామస్థులు భయపడిపోతున్నారు. తన కలలో పాములు కనిపిస్తున్నాయని.. గ్రామ శివారులో ఉన్న నాగదేవత గుడి శిథిలావస్థలో ఉందని.. వెంటనే అక్కడ గుడి కట్టించాలని అప్పుడే తనలో ఉన్న నాగదేవత తనను వీడిపోతుందని గ్రామస్థులతో ఆమె చెప్పింది. కృష్ణవేణి చెబుతున్న మాటలతో కొందరు భయపడుతుంటే మరికొందరు ఆమెకు నిజంగానే నాగదేవత పూనిందని నమ్ముతున్నారు..
రాబోయేగ్రామానికి చెందిన ఇంకొందరు అలాంటిది ఏమి లేదని యువతి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే వింతగా ప్రవర్తిస్తోందని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా దీనికి సంబంధించిన వార్త మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. తల్లిదండ్రులు చనిపోవడంతో డిఫ్రెషన్‌లోకి వెళ్లి ఇలా ప్రవరస్తుందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామస్తులే కూడా కాదు డాక్టర్లు కృష్ణవేణి తీరును చూసి మానసిక స్థితి సరిగ్గా లేనందున అప్పుడప్పుడు.. ఇలా ప్రవర్తించడం సహజమంటున్నారు. ఆమెను చూసి ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వెల్లడించారు.. మరీ ఇంకా  రోజుల్లో కృష్ణవేణి పరిస్థితి ఏమవుతుందో..?

Read more RELATED
Recommended to you

Latest news