ఇలాంటి వీడియోలను చూస్తే కన్నీరు ఆగదు భయ్యా..

-

జీవితం అనేది అందరికి సమానంగా ఉండదు.. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది..లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తూ చిన్న చిన్న కష్టాల గురించి ఫిర్యాదు చేసేవారు కొందరైతే.. తమపై ఆధారపడిన కుటుంబాన్ని పోషించేందుకు ఎండ, వాన అనేది తేడా లేకుండా ఇబ్బందులు పడుతూ బ్రతుకు జట్కా బండిని నడిపేవారు మరికొందరు..

కటిక పేదరికం లో ఉన్న వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కపూట అన్నం కోసం వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.. అలా వచ్చిన ఫుడ్.. ఒకవేళ వారికి నోటి దాకా అందకపోతే.. ఆ బాధ వర్ణనాతీతం. తాజాగా ఇంటర్నెట్‌లో ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అది చూశాక మీ గుండె బరువెక్కడం ఖాయం..

ఒకవైపు భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ.. ఓ వ్యక్తి ఒక స్కూటర్‌కు దగ్గరగా కూర్చుని భోజనం చేస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఆ వర్షం లో తడుస్తున్నా.. అతడు పట్టించుకోవట్లేదు.. కానీ అతడికి దొరికిన ఆహారాన్ని మాత్రం వర్షం నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బాగా ఆకలితో ఉన్న అతడు.. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి పట్టించు కోకుండా కడుపులో ఆకలిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 30 సెకన్ల వీడియోను ‘జిందగీ గుల్జార్ హై’ అనే ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేసింది. దీనిని చూశాక నెటిజన్లు బరువెక్కిన హృదయాలతో కామెంట్స్ చేస్తున్నారు.. ఒకపక్క ఒకరికి ఆహారం తినేందుకు సరైన జాగ లేకపోగా.. మరోపక్క మరొకరు రుచి లేదని.. ఆహారాన్ని పడేస్తున్నారు’ అని ఒకరు కామెంట్ చేస్తున్నారు.. మనకు ఉందని వృధా చెయ్యడం కన్నా లేనివారికి కాస్త పంచడం చెయ్యాలని అందరు అంటున్నారు..మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version