చర్మానికి వాడే క్రీమ్స్‌లో ఇవి ఉంటే.. క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుందట

-

చర్మానికి అందరూ ఏవేవో క్రీమ్స్‌ వాడుతుంటారు. ముఖ సౌందర్యం కోసం ఫౌండేషన్స్‌, క్రీమ్స్‌ వాడటం సహజం. కానీ అవి ఎలాంటివి అనేది చాలా ముఖ్యం. రసాయనాలు ఎక్కువగా ఉన్న క్రీమ్స్‌ వాడటం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది. ఫేస్ క్రీమ్స్‌లో హాని కారక రసాయనాలు లేకుండా చూసుకోవాలి. అందుకు వాటిని కొనుక్కునే ముందే వాటిపై ఉన్న లేబుళ్లను క్షుణ్ణంగా చదవాలి. ఆ తర్వాత మాత్రమే వాటిని కొనుక్కోవాలి. అలా కాకుండా వేటినిబడితే వాటిని బోలెడు ధరలు చెల్లించి ఇంట్లోకి తెచ్చేసుకోవడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు. ఆ హానికారక పదార్థాలు ఏమిటంటే..

స్కిన్‌ కేర్‌ క్రీములకు సువాసనను పెంచేందుకు ఈ థాలెట్లను కంపెనీలు వాడుతుంటారు. అయితే ఇవి చాలా హానికరమైన రసాయనాలు. వీటి వల్ల సంతానోత్పత్తి సమస్యలు, పిల్లల్లో ఎదుగుదల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఏదైనా క్రీముల్ని కొనుక్కునేప్పుడు దానిపై థాలెట్‌ ఫ్రీ అని రాసి ఉంటేనే కొనుక్కోండి. లేదంటే అన్‌సెంటెడ్‌ వాటిని తీసుకోవడం ఉత్తమం.

మినరల్‌ నూనె అనేది ప్రమాదకరమైనదే కాదేమో అనిపిస్తోంది కదా. కానీ ఇది చర్మంపై ఉండే రంధ్రాలు పూడిపోయేలా చేస్తుంది. దీని వల్ల మలినాలు లోపల ఉండిపోయి మొటిమల సమస్యలు పెరుగుతాయి.

స్కిన్ కేర్‌ ఉత్పత్తుల్లో చాలా వరకు పారాబెన్స్‌ అనే సింథటిక్‌ ప్రిజర్వేటివ్‌లను వాడుతుంటారు. ఇవి ఆ ఉత్పత్తి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు పనికి వస్తాయి. అయితే అది మన చర్మానికి చాలా హాని చేస్తుంది. దీని వల్ల చాతీలో క్యాన్సర్‌ గడ్డలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. దీంతో మన చర్మం విషయంలో ఈ పారాబెన్స్‌ అనే వాటిని చాలా ప్రమాదకరమైన రసాయనాల జాబితాలో చేర్చారు.

మీరు వాడే క్రీమ్స్‌పై ఎస్‌ఎల్‌ఎస్‌ లేదా ఎస్‌ఎల్‌ఈఎస్‌ అని ఉంటే దాన్ని అసలు కొనకండి. ఎస్‌ఎల్‌ఎస్‌ అంటే సోడియం లారిల్‌ సల్ఫేట్‌. ఎల్‌ఎల్‌ఈఎస్‌ అంటే సోడియం లారెత్‌ సర్ఫేట్‌. ఇవి రెండూ ఫోమింగ్‌ ఏజెంట్‌లు. చర్మంలోని తేమను, నూనెను మొత్తం తొలగించేస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారిపోయి చికాకు కలిగిస్తుంది.

మనం వాడే క్రీములన్నీ దాదాపుగా మంచి మంచి వాసనలను వెదజల్లుతుంటాయి. మరి వీటిలో సువాసన కోసం నేచురల్‌ ఫ్రేగ్రెన్స్‌లను వాడారా లేక సింథటిక్‌ ఫ్రేగ్రెన్స్‌లను వాడారా అనేది చెక్‌ చేసుకోండి. ఈ సింథటిక్‌ ఫ్రేగ్రెన్స్‌లు చర్మాన్ని ఇరిటేట్‌ చేస్తాయి. సున్నితమైన చర్మం ఉన్న వారికి వీటి వల్ల అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ సారి ఏదైనా క్రీముని కొనుక్కోవాలని అనుకున్నప్పుడు దానిపై ఫ్రేగ్రెన్స్‌ ఫ్రీ, పారాబెన్స్‌ ఫ్రీ, థాలెట్‌ ఫ్రీ అని ఉండే క్రీముల్ని ఎంచుకునేందుకు ప్రయత్నించండి.

ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సోప్స్‌ అయినా క్రీమ్స్‌ అయినా బాగా స్మెల్‌ వస్తున్నాయంటే.. అవి మంచివి కావు. అందులో కెమికల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఈసారి ప్రొడెక్ట్స్‌ ఎంచుకునేప్పుడు ఇప్పుడు చెప్పినవి లేనివి తీసుకుంటే ఉత్తమం.!

Read more RELATED
Recommended to you

Latest news