పిఠాపురం నుంచి వంగ గీతను గెలిపిస్తే.. డిప్యూటీ సీఎం చేస్తానని జగన్ హామీ

-

ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే రాబోయే వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గెలిపిస్తే పిఠాపురంలో ఉండరు అని కీలక చేశారు. గెలిచినా ఓడినా ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. కానీ, ఇక్కడ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండేది వంగా గీతనే అన్నారు.

మహిళలు దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా..?  ఐదేళ్లకొకసారి కార్లను మార్చినట్టే..  భార్యలను మార్చే ఈ దత్త పుత్రుడు ఎమ్మెల్యే అయితే కలిసే పరిస్థితి ఉంటుందా..? అని ప్రశ్నించారు. దత్తపుత్రుడికి ఓటు వేస్తే.. పిఠాపురంలో ఉంటాడా..? అని అడుగుతున్నా. జలుబు చేస్తే.. హైదరాబాద్ కి వెళ్లిపోయాడు. గాజువాక, భీమవరం, ఇప్పుడు పిఠాపురం వచ్చింది. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే.. న్యాయం జరుగుతుందా..? అని ప్రశ్నించారు. నా తల్లి, అక్క లాంటి వంగ గీతను గెలిపించండి అని కోరారు. వంగ గీతను గెలిపించండి.. డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version