టీ వలన కలిగే సమస్యలు చూస్తే.. ఈరోజే మానేస్తారు..!

-

చాలా మందికి టీ అంటే ఎంతో ఇష్టం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒక కప్పు టీ తాగుతారు అలానే సాయంత్రం వేళల్లో కూడా టీ తాగుతూ ఉంటారు మీరు కూడా ప్రతిరోజు టీ తాగుతూ ఉంటారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి టీ తాగడం వల్ల కొన్ని రకాల సమస్యలు కలుగుతాయి కాబట్టి టీ కి దూరంగా ఉండడం మంచిది మీరు కనుక టీ వల్ల కలిగే సమస్యలు చూశారంటే ఈరోజే టీ మానేస్తారు. మరి ఇంక టీ వల్ల వచ్చే సమస్యలను చూసేద్దాం.

టీ తాగితే ఈ సమస్యలు తప్పవు:

తక్కువ మోతాదులో టీ తాగితే మంచిదే. ఎక్కువగా టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు ఎక్కువగా టీ తాగితే కొన్ని రకాల సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

ఎసిడిటీ సమస్య:

టీ లో కెఫీన్ ఉంటుంది గుండెలో మంటకి ఇది కారణం అవుతుంది. టీ లో ఉండే ఆమ్ల లక్షణాలు ఎసిడిటీకి దారితీస్తాయి. కనుక ఖాళీ కడుపుతో తీసుకోవడం అసలు మంచిది కాదు.

మలబద్ధకం:

టీ తాగితే మలబద్ధకం సమస్య కూడా వస్తుంది జీర్ణక్రియ సమయంలో డిహైడ్రేషన్ కి కారణం అవుతుంది దీనివలన మలబద్ధకం వస్తుంది.

తలనొప్పి:

టీ తాగడం వలన తలనొప్పి కూడా వస్తుంది కాబట్టి అధిక మోతాదులో టీ ని తీసుకోవద్దు.

క్యాన్సర్:

టీ ని ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉంటుంది ఎక్కువ టీ తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

నిద్ర పట్టదు:

టీలో ఉండే కెఫీన్ మెదడుని చురుకుగా మార్చేస్తుంది దీంతో నిద్ర పట్టదు.

గర్భస్రావం:

ప్రెగ్నెంట్ టైంలో టీ తాగితే ఆరోగ్యం పాడవుతుంది తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి కూడా ఇది ప్రమాదం. ఎక్కువ టీ తాగడం వలన గర్భస్రావం అలానే తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటివి జరుగుతాయి కానీ టీ ని లిమిట్ గా తీసుకుంటే గుండె జబ్బులు స్ట్రోక్ టైప్ టు డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news