సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే 6 నెలల్లో డిప్రషన్‌లోకి వెళ్లటం ఖాయం..!!

-

సోషల్‌ మీడియా వల్ల మన టైమ్‌ చాలా వృద్ధా అవుతుంది.. ఐదు నిమిషాలు చూద్దాం అని తీస్తే.. గంటలు గడిచినా అది వదలబుద్ది కాదు..ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్ చేస్తే అసలు టైమే తెలియదు.. మనసులో అనుకుంటూనే ఉంటాం కానీ క్లోజ్‌ చేయబుద్ధి కాదు.. అతిగా సోషల్‌ మీడియాలో సమయం గడిపితే.. ఆరునెలల్లోనే డిప్రషన్‌లోకి వెళ్లే అవకాశం ఉందని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది..

జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే ఆరు నెలల్లోనే డిప్రషన్‌లోకి వెళ్తారని వెల్లడించింది. ఇటీవల కాలంలో అధిక శాతం మంది యువత వివిధ సోషల్‌ మీడియా మాధ్యమాలను విపరీతంగా వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఆర్కాన్సాస్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్‌ అభ్యసించే డాక్టరల్ విద్యార్థి అయిన రెనే మెర్రిల్ బృంధం ‘సోషల్ మీడియా వినియోగం, వ్యక్తిత్వ వికాస అభివృద్ధి మధ్య సంబంధం’ పేర నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని తెలిపారు.

సోషల్ మీడియాను వినియోగించే భిన్న వ్యక్తిత్వాలున్న వ్యక్తులు ఏ విధంగా డిప్రెషన్‌ బారీన పడుతున్నారో వీరి పరిశోధనల్లో తెలిపారు..తక్కవ అగ్రియబుల్‌నెస్‌ ఉన్న వారి కంటే అధిక అగ్రియబుల్‌నెస్‌ ఉన్న వారు 49 శాతం అధికంగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా అధిక న్యూరోటిసిజం ఉన్నవారు రోజుకు 300 నిమిషాలకు పైగా సోషల్ మీడియాను వినియోగిస్తున్నారని, తక్కువ న్యూరోటిసిజం ఉన్నవారి కంటే డిప్రెషన్‌ను అభివృద్ధి చెందే అవకాశం వీరిలో రెండు రెట్లు ఎక్కువ అని తెలిపారు.

డిప్రెషన్‌ డెవలప్‌ అవడంలో వ్యక్తుల వ్యక్తిత్వం, సోషల్ మీడియా వినియోగంతో ముడిపడి ఉందని పరిశోధకులు అంటున్నారు. 2018 నుంచి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,000కి పైగా అమెరికా యువత నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలో గడపడం వల్ల ఇంట్లో ఉన్నప్పటికీ.. ఇంట్లో వాళ్లతో సంబంధం లేకుండా..ఒంటరిగా ఉంటూ ఇతర కార్యకలాపాలకు దూరంగా ఉండటం వల్ల డిప్రెషన్‌ అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు.

డిప్రషన్‌ అనేది ఆయుధం లేకుండా యుద్ధం చేయడం లాంటింది.. ఇందులో ఓటమి ఉండదు.. కచ్చితంగా గెలుపే ఉంటుంది. మనిషిని అంతకంతకు దహించివేయడమే దీని అంతిమ లక్ష్యం.. కొన్నిసార్లు డిప్రషన్‌ వల్ల సూసైడ్‌ కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అధిక మరణాలకు డిప్రెషన్ ప్రధాన కారణంగా వీరి పరిశోధనల్లో గుర్తించారు. వ్యక్తులతో వర్చువల్‌గా కనెక్ట్ అవ్వడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే సంభావ్యత ఎక్కువ. సోషల్‌ మీడియాల ద్వారా సంభాషించడం కన్నా ముఖాముఖిగా మాట్లాడుకోవడం వల్ల మానవ సంబంధాల నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు.
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news