బిసినెస్ ఐడియా: రోజుకు 2-3 గంటలు కష్టపడితే చాలు ..నెలకు రూ. 50 వేలకు పైగా ఆదాయం..

-

ఉద్యోగం చేసి విసిగి పోయారా? వచ్చిన జీతం సరిపోలేదా? ఏదైనా బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా.. అయితే రోజుకు 2-3 గంటలు కష్టపడితే చాలు నెలకు రూ.50 వేలు సంపాదించడం ఎలాగో తెలుసుకుందాము.. బిజినెస్ ఐడియాస్ ద్వారా ఎంతో మంది యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు కదులుతున్నారు. అయితే ఫుడ్ బిజినెస్ రంగంలోని మరో అవకాశం గురించి తెలుసుకుందాం. కోడిగుడ్ల వ్యాపారం అని చీప్‌గా చూడొద్దు. ఇది నిరంతరం ఆదాయ వనరుగా ఉంది. సీజన్ తో సంబంధం లేకుండా కోడిగుడ్లను అందరూ వినియోగిస్తారు. పైగా వీటి డిమాండ్ కూడా ఏటేటా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ఎగ్ బిజినెస్ మోడల్ లో మనం చేయాల్సింది.

హోల్ సెల్ దుకాణాల వద్దకు వెళ్లి కోడి గుడ్లను కొనుగోలు చేయాలి. వాటిని హోటల్స్, కాలేజీలు,రెస్టారెంట్స్, హాస్టల్స్ కు సప్లై చేసే ఎగ్ సప్లయర్ వ్యాపారం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

ముందుగా ఈ బిజినెస్ చెయ్యాలంటే కావాల్సింది ఒక గది.
ఒక మినీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ అవసరం ఉంటుంది.

ఫారంగేట్ వద్ద ఒక కోడిగుడ్డు ధర రూ.4 ఉంటే, మార్కెట్లో ఒక్కో ఎగ్ ధర రూ. 5 వరకూ అమ్మవచ్చు.ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రూ.6 ఉంది.
ఈ బిజినెస్ లో ముందుగా హోల్ సేలర్లు, రిటైల్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు రూ.1 లాభాన్ని పంచుచోవాల్సి ఉంటుంది.

ముందుగా హోల్ సేలర్ ఫారం గేట్ దగ్గర కోడిగుడ్డును రూ.4 చొప్పన ఒక ట్రేను కొనుగోలు చేస్తే (రూ.4 X 30గుడ్లు) రూ. 120 ఖర్చు అవుతుంది.

అయితే ఒక ట్రే కోడి గుడ్లు మార్కెట్ రేట్ లో రూ.150 పలుకుతుంది. అంటే ఒక ట్రే మీద మనకు రూ.30 లాభం వస్తుంది.

అయితే వచ్చిన రూ.30 లాభంలో హోల్ సేలర్ వాటా రూ.14, సప్లయర్ వాటా రూ.6, రిటైల్ అమ్మకం దారు వాటా రూ.10 (ఒక ట్రే మీద లాభం రూ.30 =రూ.14+రూ.6+రూ.10)

అంటే ఎగ్ సప్లయర్ కు ఒక ట్రే మీద రూ.6 లాభం వస్తుంది.

ఒక ఏరియాలోని 20 షాపుల్లో 5 ట్రేల చొప్పన 100 ట్రేలను సప్లయ్ చేస్తే

మనకు 100 ట్రేల మీద కమీషన్ రూ.6 చొప్పన రూ.600 లాభం వస్తుంది.

అలా నెలకు రూ.18000 ఆదాయం పొందవచ్చు
టోటల్ సిటీలోని షాపులకు గుడ్లు వేస్తె 2 నుంచి 3 గంటలు టైం పడుతుంది.. అదే వేస్తె మంచి ఆదాయం పొందవచ్చు. ఎలా లేదనుకున్న కుదుఖ్త్ అన్ని ఖర్చులు పోగా రూ. 50 వేలు పొందవచ్చు.. మీకు బిజినెస్ చెయ్యాలను అనుకుంటే ఇది ట్రై చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news