తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అస్వస్థత

-

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప జ్వరం తో ఆయన బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి దురై మురుగన్ తెలిపారు. శనివారం రాత్రి ఆయనకు జ్వరం వచ్చిందని చెప్పారు. ఆయనను పరీక్షించిన వైద్యులు రెండు రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారని తెలిపారు. అనారోగ్యం నేపథ్యంలో ఈ రోజు మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయిందని చెప్పారు.

వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలో ఈరోజు సీఎం స్టాలిన్ పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటనకు డీఎంకే శ్రేణులు భారీ ఏర్పాట్లు కూడా చేశాయి. ఇంతలోనే ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయిందని ప్రకటన వెలువడింది. దీంతో స్టాలిన్ అభిమానులు ఆయన తొందరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదిక ద్వారా కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version