తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి, ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ ప్రాంతం వైపు గాలులు వీస్తున్నాయి. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో చలి తీవ్రత తక్కువైంది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అకాల వర్షాలతో తెలంగాణలో అన్నదాతలు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా చేతికొచ్చిన పత్తి, మిర్చి పంటలు దెబ్బ తిన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన చేసి పంట నష్టాన్ని అంచానా వేశారు.