మండే వేసవిలో చల్లదనం కావాలంటే ఆ ప్రదేశాలకు వెళ్ళాల్సిందే..!

-

ఒకవైపు భగ మండే ఎండలు..మరో వైపు తొలకరి చినుకులు..అయిన వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి జనాలు కొత్త ప్రాంతాలను సెర్చ్ చేస్తారు. ముఖ్యంగా వేసవిని,వర్షా కాలాన్ని కవర్ చేయాలంటే మన దేశంలోని కొన్ని బీచ్ లు బెటర్ అని ప్రకృతి ప్రేమికులు అంటూన్నారు.. ఫ్యామిలీ తో ఎంజాయ్ చేసే బీచ్ లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దక్షిణ భారత దేశంలో అనేక వైవిధ్యమైన ప్రాంతాలున్న సంగతి తెలిసిందే. ఇక్కడ బీచ్ లు కూడా మనకు కనువిందు చేస్తాయి. వేసవి కాలంలో బీచులలో ఉంటే ఆ సరదాయే వేరు. అందుకే కొత్తగా పెల్లయిన జంటలు హనీమూన్ కోసం బీచ్ లున్న ప్రాంతాలను ఎన్నుకుని మరీ తమ ప్రయాణాలు కొనసాగిస్తారు..ఏపీ లోని విశాఖ లోని రామకృష్ణ బీచ్ అత్యంత ప్రముఖమైనది. ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటుంది. అందాలను వీక్షించాలనుకునే వారికి ఈ బీచ్ ఎంతో అందంగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. దీంతో బీచ్ ను సందర్శించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

అలాగే కర్ణాటక లో మరో ఫెమస్ బీచ్ కూడా ఉంది.దీని పేరు ఓం. చాలా ఫేమస్. అద్భతమైన అందచందాలు దీని సొంతం. పర్యాటకంగా సాంస్కృతికంగా ఇది ఎంతో ప్రసిద్ధి. అందుకే ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు. తమ టూర్ ను సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడకు వచ్చి సరదాగా గడుపుతారు..చెన్నైలో మరో బీచ్ కూడా ఉంది.. ఆ బీచ్ కు ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువే..పరవశానికి గురి చేస్తాయి. కొత్తగా పెళ్లయిన జంటలు ఎక్కువగా వస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇంకా కొచ్చిలోని చెదాయ్ బీచ్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి వంటి ప్రదేశాలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..ఈబీచ్ లన్నీ కూడా జనాలకు మంచి అనుభూతిని ఇవ్వడంతో పాటు వేసవి తాపాన్ని కూడా తీరుస్తాయి..అందుకే ప్రతి ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. మీరు కూడా ఇలాంటి ప్లాను వుంటే ఈ బీచ్ లను సందర్షించండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version