ప్రస్తుతం శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే పలు దేశాలు ఆర్థికసాయం ప్రకటించాయి. భారత దేశ ప్రభుత్వం కూడా గత నెల దాదాపు రూ.3,881 కోట్లు ప్రకటించింది. తాజాగా మరో సాయం చేసింది. నౌక ద్వారా 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను పంపించింది. ఇప్పటికే ఆ నౌక కొలంబోకు చేరుకుందని భారత హైకమిషన్ మంగళవారం తెలిపింది.
కాగా, శ్రీలంకకు 1948లో స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ ఎదుర్కోలేనంత సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకులు, విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక ప్రజలు పరిస్థితి పూర్తి అధ్వానంగా ఉంది. ఈ మేరకు భారత్.. శ్రీలంక దేశానికి సాయం కొనసాగిస్తోంది. ఏప్రిల్-మే నెలలో శ్రీలంకకు మొత్తం 40 వేల మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని పంపించింది.