ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందించి, చిత్తూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్న గ్రానైట్ మాఫియా పై సీఎస్ కు లేఖ రాయడం చర్చకు తావిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా,గుడిపల్లె మండలం, గుతర్లపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఇదంతా అధికార పార్టీ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. ఇటీవలే అక్రమ మైనింగ్‌కు పది గ్రానైట్ లారీలను అధికారులు సీజ్ చేయడం ఇందుకు నిదర్శమని చెప్పారు.
మరోవైపు మట్టి మాఫియా కూడా రెచ్చిపోతోంది. బెజవాడ కేంద్రంగా సొంత మనుషులే ఈ మాఫియాకు పాల్పడుతున్నారని గన్నవరం వైసీపీ లీడర్ దుట్టా రామచంద్రరావు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించకపోతే ప్రభుత్వం పరువు పోవడం ఖాయమని అంటున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న లీడర్లు (వల్లభనేని వంశీ మోహన్, గన్నవరం ఎమ్మెల్యే) అలాంటిదేమీ లేదని తోసిపుచ్చుతున్నారు. కానీ వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని దుట్టా వర్గం సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని పోయేందుకు సిద్ధం అవుతోంది.