Ind vs Pak : తొలి వికెట్‌ కొల్పోయిన పాకిస్తాన్‌

-

మ్యాచ్‌ ఆరంభంలోనే పాకిస్తాన్‌కు షాక్‌ తగిలింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్ తీసుకుంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన రెండో ఓవర్లోనే సత్తాచాటాడు. తొలి ఓవర్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను ఇబ్బంది పెట్టిన భువీ.. మూడో ఓవర్ నాలుగో బంతికి అతన్ని అవుట్ చేశాడు. భువీ వేసిన షార్ట్ బాల్‌ను పుల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ ఈ క్యాచ్ అందుకోవడంతో బాబర్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

Asia Cup 2022, India vs Pakistan Live Score Updates: India On Top As  Pakistan Lose Babar Azam, Fakhar Zaman In PowerplayBhuvneshwar, Avesh Khan  Put India On Top As Babar Azam Fakhar Zaman

పాకిస్తాన్ జట్టు మూడు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో పాక్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 15 పరుగుల వద్ద బాబర్‌ ఆజమ్‌(10) షాట్‌కు ప్రయత్నించి అర్ష్‌దీప్‌ చేతికి చిక్కాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి పాక్‌ స్కోర్‌ 19/1. క్రీజ్‌లో రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌ ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news