ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టీ20 జరుగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఉప్పల్‌లోని క్రికెట్ స్టేడియం మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే మొహాలీలో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా, నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో టీమిండియా గెలిచి 1-1 తేడాతో సమంగా ఉన్నాయి. దీంతో నేటి మ్యాచ్ సిరీస్ విజేతను తేల్చనుంది. గత మ్యాచ్‌లో అదిరిపోయే బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫినిష్ చేసిన రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా బీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు. జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని నాగ్‌పూర్ టీ20లో టీమ్‌తో కలిశాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడబోయే స్టార్ ప్లేయర్లు అంతా కలిసి నేటి మ్యాచ్‌లో బరిలో దిగబోతున్నారు. ఆసియా కప్ 2022 టోర్నీలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
దీంతో విరాట్ ఫ్యాన్స్, నేటి మ్యాచ్‌లో అతని నుంచి ఓ టాప్ క్లాస్ ఇన్నింగ్స్ రావాలని కోరుకుంటున్నారు. 2019లో వెస్టిండీస్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ 50 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేయడానికి ముందు విరాట్ కోహ్లీకి టీ20ల్లో ఇదే అత్యధిక స్కోరు. దీంతో బాగా అచొచ్చిన గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, అతని ప్లేస్‌లో భువనేశ్వర్ కుమార్‌ని తిరిగి జట్టులోకి చేర్చింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఎక్కువ మ్యాచులు ఆడతారని ఆశిస్తున్న ప్లేయర్లు అందరూ నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నారు.