IND vs ENG: భారత అభిమానులపై జాతి వివక్ష వ్యాఖ్యలు!

-

బర్నింగ్ సాంగ్ వేదికగా ఇంగ్లాండ్ మరియు ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన టీమిండియా అభిమానులకు చేదు అనుభవం ఎదురయింది. అక్కడ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కొంతమంది ఇండియా ఫ్యాన్స్ పై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.

మ్యాచ్ నాలుగో రోజు బ్లాక్ నెంబర్ 22లో కొంతమంది తమను ఉద్దేశించి జాతి పేరుతో దూషించినట్లు ఇండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫోటోలు అలాగే వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పందించింది. జరిగిన ఘటనపై క్షమాపణలు కోరుతూ విచారణ జరుగుతామని వెల్లడించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఎడ్జ్ బస్టాండ్ లోని తమ ప్రతినిధులతో ఈ వ్యాఖ్యల ఘటనపై విచారణ జరుపుతామని ఇలాంటి విషయాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది ఇంగ్లాండ్ బోర్డు. కాగా ఈ ఐదవ టెస్ట్ మ్యాచ్ లో… ఇంగ్లాండ్ పట్టు బిగిస్తోంది. విజయానికి మరో 119 పరుగుల దూరంలో ఇంగ్లాండ్ జట్టు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news