నిద్రలేమి గురించి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం.. అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది. కారణాలు ఏంటి, నివారణ మార్గాలు ఏంటి.. ఇలా మస్త్ మాట్లాడుకున్నాం.. కానీ ఈ సమస్య ఇండియాలోనే ఎక్కువగా ఉందని మీకు తెలుసా..? ఆలస్యంగా నిద్ర పోవడం అనేది ఇండియన్స్‌కు అలవాటైంది. నేటి ఆధునిక జీవనశైలితో నిద్రలేమి అనేది సాధారణ సమస్యగా మారింది. చాలా మంది భారతీయులు నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు.
Wakefit గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ (GISS) ప్రకారం.. భారతీయులు తక్కువగా నిద్రపోతున్నారని తేలింది…GISS 2018 నుంచి భారతదేశ నిద్ర అభ్యాసాన్ని ట్రాక్ చేస్తోంది. ఈ అధ్యయనాల ప్రకారం.. మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించేవారిలో నిద్ర సమస్య ఉంటుంది. నలుగురు భారతీయులలో ఒకరికి నిద్రలేమి సమస్య ఉంటుందట..
చాలా మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాతే నిద్రికు ఉపక్రమిస్తున్నారు.. దీనికి ఒక పెద్ద కారణం సోషల్ మీడియా. సామాజిక మాధ్యమాల్లో బ్రౌజ్ చేయడం కూడా నిద్ర సమస్యకు కారణం. 36 శాతం మంది ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం ఉంది. ఇక అనేక మంది.. నిద్రపోయే ముందు తమ ఫోన్‌లలో సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ చూస్తున్నట్టుగా అంగీకరించారు. 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. కొవిడ్ 19 తర్వాత రాత్రిపూట సామాజిక మాధ్యమాల్లో కాలాన్ని గడిపే అలవాటు విపరీతంగా పెరిగింది.
కోల్‌కత్తాలో ఎక్కువ…
కోల్‌కత్తాలో 40 శాతం ప్రజలు మధ్యరాత్రి తర్వాత పడుకుంటారు. హైదరాబాద్‌లో 40 శాతం ప్రజలు పని చేయడం వల్ల ఆలస్యంగా నిద్రపోతున్నారు. గురుగ్రామ్‌న 36 శాతం మంది ప్రజలు పని చేయడం ఆలస్యం అవుతోంది. ముంబైలో 39 శాతం ఫోన్స్ చూసి.. సమయం వృథా చేస్తున్నారు.
ఇండియాలో చాలామందికి ఊబకాయం, మధుమేహం, బీపీ ఉంటుంది.. వీటన్నింటికి మూలకారణం.. నిద్రసరిగ్గా లేకపోవడమే.. త్వరగా పడుకోవడం వల్ల మన శరీరంలోని హార్మోన్లు, ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మన ఒత్తిడి ప్రతిస్పందనకు కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ సహజంగా రాత్రి ప్రారంభ గంటలలో తక్కువగా ఉంటుంది. త్వరగా పడుకోవడం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో మీరు ఈ దీర్ఘకాలికరోగాల భారిన పడొద్దంటే.. ఇక నుంచి అయినా త్వరగా పడుకోని త్వరగా లేవండి..!!