అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన విచిత్ర ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. వృద్ధాప్యం, జ్ఞాపశక్తిపై విమర్శలతో అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తాజాగా వైట్ హౌజ్‌లో వరల్డ్ సిరీస్ విజయం తర్వాత టెక్సాస్ రేంజర్స్ గౌరవార్థం చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ సిబ్బందికి మరోసారి ఝలక్ ఇచ్చారు.
ఈ సందర్భంగా పర్సనలైజ్‌డ్ జెర్సీ, కౌబాయ్ బూట్లను బహుమతులుగా స్వీకరిస్తూ.. అంతలో హఠాత్తుగా ఆయన ‘‘ఆల్‌రైట్.. ఇప్పుడు నేనేం చేస్తున్నాను’’ అని అంటూ వింతగా చూడటంతో సిబ్బంది షాక్ అయ్యారు. మరోవైపు అదే సమయంలో ఆయన మిలటరీ సహాయకుడు వచ్చిన సాయంగా గిఫ్ట్స్ పట్టుకునేందుకు రాగా ‘‘నా జెర్సీ దొంగిలిస్తున్నావా’’ అంటూ సరదాగా అన్నారు. దీంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత వారితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు కొన్ని నెలల క్రితం ఓ కీలక నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తడంతో అధ్యక్ష రేసు నుంచి ఆయన వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.