పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఈ రోజు అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బిగ్ రిలీఫ్ లభించింది. తాజాగా ఈరోజు పాక్ నేషనల్ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస తీర్మాణాన్ని స్పీకర్ తోసిపుచ్చాడు. ఈ తీర్మాణం విదేశీదారుల కుట్రతో ప్రభుత్వం మార్పిడికి చేసిన కుట్రగా ఆయన సభలో వెల్లడించారు. మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవించిన స్పీకర్ అవిశ్వాస తీర్మాణం వెనక విదేశీ కుట్ర ఉందని తోసిపుచ్చాడు. మళ్లీ ఈనెల 25కు సభను వాయిదా వేశాడు. దీంతో తర్వాతి సభ జరిగే వరకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఈనెల 25వ వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రధాన పదవికి ఎలాంటి ఆటంకం లేదు. ఈరోజు జరిగన సభకు అధికార పీటీఐ నుంచి కేవలం 22 మంది మాత్రమే రాగా… ప్రతిపక్షాల నుంచి 176 మంది హాజరు అయ్యారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సభకు హజరు కాలేదు. ఈరోజు అవిశ్వాస తీర్మాణం కావడంతో రాజధాని ఇస్లామాబాద్ లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్… అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చిన స్పీకర్
-