పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్య తేలేది నేడే…. అవిశ్వాస తీర్మాణంపై నేడు ఓటింగ్

-

పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు చేరుకుంది. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు పాక్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే దాదాపుగా ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఇమ్రాన్ సర్కార్ కు మద్దతు ఇస్తూ ఉన్న పార్టీలన్నీ ప్రతిపక్షాలతో చేతులు కలిపాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ పడిపోయింది. మొత్తం 342 మంది జాతీయ అసెంబ్లీలో అధికారం నిలుపుకోవాలంటే 172 మంది మద్దతు అవసరం కానీ… ప్రస్తుతం ఇమ్రాన్ కు 162 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. 

ఇదిలా ఉంటే పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ఇటీవల ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాడు…తనను గద్దె దించేందుకు విదేశీ కుట్రదారులు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు. పాక్ ప్రతిపక్షాలను మేకల్లా కొనుగోలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తను అవిశ్వాసం ఎదుర్కొంటున్న ఈ రోజు దేశ యువత, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news