Telangana : ‘పది’ పరీక్షలు.. నేర చరిత్ర ఉన్న ఇన్విజిలేటర్ల తొలగింపు

-

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో వరుసగా రెండు పరీక్షల ప్రశ్నపత్రాలు.. పరీక్ష ముగియకముందే వాట్సాప్‌ ద్వారా బయటకు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే పరీక్షలు  జరుగుతున్న ప్రతి కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమిస్తున్నారు. మరోవైపు తాండూరులో పోక్సో కేసు నమోదైన బందెప్పను పరీక్షల విధుల్లోకి ఎలా తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో క్రిమినల్‌ కేసులుండి, వ్యక్తిగత నేపథ్యం సరిగా లేని ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద పహారా కాసే పోలీసుల సంఖ్యనూ పెంచుతున్నారు. ఈ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, ఏఎన్‌ఎంలు కూడా సెల్‌ఫోన్‌ వినియోగించకుండా నిషేధించారు. ఇన్విజిలేటర్లను తనిఖీ చేసి లోపలికి పంపాలని అధికారులు స్పష్టం చేశారు.

చాలా కేంద్రాల్లో 20 మార్కుల బిట్‌ పేపర్‌ (పార్ట్‌-బి) సమాధానాలను ఇన్విజిలేటర్లే చెబుతున్నారని, విద్యార్థులు చూసి రాసుకుంటున్నా నియంత్రించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అలాంటి చర్యలకు పాల్పడినా.. చూస్తూ ఊరుకున్నా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చినట్లు ఆయా వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version