IPL 2022: ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడికి కరోనా!

-

క్రికెట్ ప్రేమికులకు షాకింగ్ న్యూస్. ఐపీఎల్ 2022;  మళ్ళీ కరోనా కలకలం సృష్టించింది.గత ఏడాది కూడా ఇలాగే నలుగురు ప్లేయర్స్ కి కరోనా రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడింది.మళ్లీ ఈ ఏడాది కూడా కరోన ఐపీఎల్ ని వదిలి పెట్టేలా లేదు.కాగా ఈ సందర్భంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కరోనా కలకలం రేగింది.రెండు రోజుల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాట్ కరోన బారినపడిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని మరో కీలక ఆటగాడికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.

ఆ జట్టు ఏప్రిల్ 20న పంజాబ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.ఢిల్లీ క్యాపిటల్స్ నేడు పుణేకు వెళ్లాల్సి ఉండగా కరోనా కేసు వెలుగు చూడటంతో ఆ షెడ్యూల్ ని రద్దు చేసింది.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మాత్రం ఏదో ఒక రూపంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను మాత్రం వెంటాడుతూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version