మీరు గోవా టూర్ వేయాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టూర్ ప్యాకేజీ వివరాలను చూడచ్చు. గోవాలో హనీమూన్ చేసుకోవాలని అనుకునే వారు కూడా ఈ టూర్ ప్యాకేజీని చూస్తే బాగుంటుంది. ఇక పూర్తి వివరాలను చూస్తే.. ‘గోవా డిలైట్’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చారు.
3 రాత్రులు, 4 రోజులు ప్యాకేజీ ఇది. గోవా టూర్ 2022 నవంబర్ 24న మొదలవుతుంది. నవంబర్ 27న ఈ టూర్ ముగుస్తుంది. ఇక టూర్ ప్యాకేజీ వివరాలను చూస్తే.. అర్వాలెమ్ కేవ్స్, వాటర్‌ఫాల్స్, ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ ఇవన్నీ కూడా చూడచ్చు. రీస్ మేగస్ ఫోర్ట్, బోండ్లా వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ, మంగేషీ టెంపుల్ ని కూడా కవర్ చేసేయచ్చు.
గోవా చేరుకున్నాక హోటల్ లో చెకిన్ అవ్వాలి. జువారీ రివర్ ని చూడచ్చు.
రెండో రోజు అయితే సౌత్ గోవా టూర్ ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్, ఆర్కియలాజికల్ మ్యూజియం ఇవన్నీ కూడా చూడచ్చు. సాయంత్రం మండోవి రివర్‌లో బోట్ క్రూజ్ కూడా చూసేయచ్చు.
మూడో రోజు నార్త్ గోవా సైట్ సీయింగ్ ఉంటుంది. అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ వంటివి కూడా చూసేయచ్చు.
నాలుగో రోజు ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్ రీచ్ అవుతారు. టూర్ ముగుస్తుంది.
ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.20,980 గా వుంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.21,455, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.27,330 గా వుంది. పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో చూసి ఏఈ టూర్ ని బుక్ చేసుకోవచ్చు.