వైసీపీలో బిగ్ ట్విస్ట్: ఆలీకి సీటు?

-

సినీ నటులు చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో కొందరు సక్సెస్ అయితే..కొందరు ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో పలువురు సినీ నటులు ఉన్నారు. ఇటు బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉండగా, అటు పవన్ జనసేన అధినేతగా ఉన్నారు. రోజా మంత్రిగా ఉన్నారు..ఇంకా పలువురు నటులు రాజకీయాల్లో ఉన్నారు. ఇదే క్రమంలో ప్రముఖ కమెడియన్ ఆలీ వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే.

గత ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. అప్పుడే ఆయన సీటు కోసం ప్రయత్నించారు గాని..సీటు దక్కలేదు. దీంతో పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఇక వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక కూడా ఆలీ ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే జగన్..ఆలీకి ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. పదవి ఇచ్చాక ఇంకా యాక్టివ్ గా ఉంటున్నారు. అదే ఊపులో జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి రెడీ అని చెప్పారు.

పవన్ పై పోటీ విషయం పక్కన పెడితే.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని ఆలీ చూస్తున్నారు. అలాగే ఆయన కొన్ని సీట్లపై కన్నేశారు..వాటిల్లో ఏదొకటి దక్కించుకోవాలని చూస్తున్నారట. మొదట తాను పుట్టిన గడ్డ రాజమండ్రిపై ఫోకస్ పెట్టారు. రాజమండ్రి సిటీ లేదా రూరల్ సీట్లలో ఏదొకటి దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ రెండు సీట్లు ఇప్పుడు టి‌డి‌పి ఖాతాలో ఉన్నాయి. టి‌డి‌పి బలంగా ఉంది.

ఈ సీట్ల కోసం వైసీపీలో పోటీ ఉంది. మరి ఆలీకి సీటు దక్కుతుందో చెప్పాలమే. అవి కాకపోతే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న గుంటూరు ఈస్ట్, కర్నూలు సిటీ, కడప సిటీ సీట్లపై ఫోకస్ పెట్టారు. కానీ ఆ మూడు చోట్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని కాదని జగన్ ఆలీకి సీటు ఇస్తారనేది డౌటే. చూడాలి మరి జగన్..ఆలీకి సీటు ఇస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news