ఒకప్పుడు లెజెండరీ ఆటగాళ్లతో దుర్భేధ్యంగా కనిపించిన ఆస్ట్రేలియా(Australia)జట్టుకు ఇప్పుడు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మొదటి టీ20లో విండీస్ చేతిలో దారుణ ఓటమి అనంతరం రెండో టీ20లోనూ ఆస్ట్రేలియా అదే తీరున ఓడింది. నికోలాస్ పూరన్ సారథ్యంలోని విండీస్ జట్టు రెండో టీ20లో ఆసీస్‌ను చితక్కొట్టింది. దీంతో ఆసీస్‌పై విండీస్ 56 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదటి టీ20లో ఆస్ట్రేలియా కేవలం 16 ఓవర్లలోనే చాప చుట్టేసింది. విండీస్ నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. తాజాగా ఆదివారం గ్రాస్ ఐలెట్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ ఆసీస్ 19.2 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఈసారి భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఆసీస్ తడబడింది. దీంతో 56 పరుగుల భారీ తేడాతో విండీస్ గెలుపొందింది.
Australia were bowled out in consecutive T20Is for the first time since 2️⃣0️⃣1️⃣0️⃣ when they were bowled out by Pakistan twice at Edgbaston!#WIvAUS #MissionMaroon pic.twitter.com/sa2B0TQ6NL
— Windies Cricket (@windiescricket) July 11, 2021
కాగా ఆసీస్ ఇలా రెండు టీ20ల్లోనూ చిత్తుగా ఓడిపోవడం, కనీసం పోరాటం కూడా చేయకపోవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దుర్బేధ్యమైన జట్టుగా ఉన్న ఆసీస్ ఎంతగా పతనం అయింది అని కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టు పని ఇక అయిపోయింది, ఆస్ట్రేలియా ఫినిష్డ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సిరీస్‌లో విండీస్ 2-0తో ఆధిక్యంలో ఉండగా మరో 3 టీ20లు మిగిలి ఉన్నాయి. మరి వాటిల్లోనైనా ఫించ్ సేన సత్తా చాటుతుందా, లేదా అన్నది చూడాలి.