గుడివాడలో బాబు..అభ్యర్ధి ఫిక్స్ చేస్తారా? కొడాలి ప్రత్యర్ధి ఆయనేనా?

-

కొడాలి నాని అడ్డా గుడివాడలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు ఎంటర్ కాబోతున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన గుడివాడకు వస్తున్నారు. దీంతో గుడివాడ టి‌డి‌పి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అలాగే ఈ దెబ్బతో కొడాలికి చెక్ పడుతుందని అనుకుంటున్నారు. అయితే ఒకప్పుడు గుడివాడ టి‌డి‌పికి కంచుకోట గానే ఉండేది. కానీ కొడాలి నాని టి‌డి‌పి నుంచి వైసీపీ వైపుకు వెళ్ళడంతో..సీన్ మారిపోయింది.

గత రెండు ఎన్నికల్లో కొడాలి వైసీపీ నుంచి గెలిచారు. ఇక కొడాలి ఏ స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేసి తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఆయనకు చెక్ పెట్టాలని టి‌డి‌పి శ్రేణులు చూస్తున్నారు. కానీ సరైన నాయకత్వం లేక టి‌డి‌పి శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయి. ఏ నాయకుడు పోటీ చేస్తారో క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు బాబు పర్యటన ఉండటంతో..ఆయన గుడివాడపై ఫోకస్ పెట్టి, అభ్యర్ధిని ఖరారు చేస్తారని  టి‌డి‌పి శ్రేణులు భావిస్తున్నాయి.

 

వాస్తవానికి గుడివాడ టి‌డి‌పి ఇంచార్జ్ గా రావి వెంకటేశ్వరావు ఉన్నారు..ఈయన ఇప్పటికే పలుమార్లు సీటు త్యాగం చేశారు. 2004లో కొడాలి నాని కోసం, 2019లో దేవినేని అవినాష్ కోసం సీటు వదులుకున్నారు. ఇక ఆ ఇద్దరు వైసీపీలోకి వెళ్ళిపోయారు. అయినా రావి టి‌డి‌పిలోనే ఉన్నారు. ఇప్పుడు ఇంచార్జ్ గా ఉన్నారు. నెక్స్ట్ పోటీ చేయాలని చూస్తున్నారు. కార్యకర్తల సపోర్ట్ రావికి ఉంది.

అయితే పిన్నమనేని బాబ్జీ, పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా గుడివాడలో ఉన్నారు. కానీ వారికి సీటు కష్టమే. ఇదే సమయంలో ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము గుడివాడలో ఎంట్రీ ఇచ్చారు. ఈయన ఆర్ధికంగా బలమైన నేత..అటు ఈయన కమ్మ వర్గం కాగా, ఇక ఆయన వైఫ్ ఎస్సీ వర్గం దీంతో…కమ్మ, ఎస్సీ వర్గం కాంబినేషన్ కలిసొస్తుందని, తనకు సీటు వస్తుందని ఆశిస్తున్నారు. ఇక గుడివాడకు రాబోతున్న బాబు..సీటు ఎవరికి ఫిక్స్ చేస్తారో చూడాలి. త్వరగా సీటు ఫిక్స్ చేస్తే బెటర్..లేదంటే టి‌డి‌పికి ఇంకా నష్టం.

Read more RELATED
Recommended to you

Latest news