పవన్‌కు భలే ఛాన్స్..బీజేపీని వదిలించుకుంటారా?

-

ఏపీలో పొత్తుల విషయంలో ఏ మాత్రం క్లారిటీ రాని విషయం తెలిసిందే. అసలు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు..అసలు పొత్తులు ఉంటాయా? లేదా? అనేది తెలియడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో బి‌జే‌పి-జనసేన అధికారికంగా పొత్తులో ఉన్నాయి. కానీ ఇప్పటికే పవన్ కల్యాణ్-చంద్రబాబు రెండుసార్లు కలిశారు. దీంతో టి‌డి‌పి-జనసేన పొత్తు ఖాయమని ప్రచారం వచ్చింది. బి‌జే‌పి కూడా వాళ్ళతో కలుస్తుందని టాక్ నడిచింది.

కానీ బి‌జే‌పి మాత్రం..టి‌డి‌పితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్పేసింది. అటు టి‌డి‌పి సైతం  ఏమాత్రం బలం లేని బి‌జే‌పితో పొత్తు ఇష్టం లేదు..కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల.. కేంద్రం సపోర్ట్ మాత్రం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే బి‌జే‌పి మాత్రం పొత్తుకు రావడం లేదు. దీంతో పొత్తులో బి‌జే‌పి కలిసే ప్రసక్తే లేదు. పోనీ జనసేన-బి‌జే‌పి పొత్తు ఉంటుందా? అంటే అది డౌటే..ఎందుకంటే బి‌జే‌పితో పొత్తు వల్ల జనసేనకు ప్రయోజనం లేదు. అదే టి‌డి‌పితో కలిస్తే పరిస్తితి వేరుగా ఉంటుంది. కానీ బి‌జే‌పిని వదిలించుకుని పవన్..టి‌డి‌పి వైపుకు వెళ్లలేని పరిస్తితి.

అయితే ఇలాంటి తరుణంలోనే బి‌జే‌పిని వదిలించుకోవడానికి పవన్‌కు మంచి అవకాశం దొరికిందనే చెప్పాలి. పవన్ ఏ స్థాయిలో జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారో తెలిసిందే. కానీ బి‌జే‌పి అలా చేయడం లేదు. పైగా ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు, జి‌వి‌ఎల్, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు జగన్‌కు అనుకూలంగా నడుస్తున్నారని చెప్పి..బి‌జే‌పిలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు.

ఈ క్రమంలోనే సోము, జి‌వి‌ఎల్ వైఖరి నచ్చక కన్నా లక్ష్మీనారాయణ బి‌జే‌పిని వదిలి టి‌డి‌పిలో చేరారు. ఇంకా కొందరు నేతలు కూడా అదే బాటలో ఉన్నారు. సొంత బి‌జే‌పి నేతలే అసంతృప్తితో ఉన్నారు..అలాంటప్పుడు పవన్ సైతం..బి‌జే‌పి..వైసీపీకి దగ్గరగా ఉందనే నెపంతో బయటకొచ్చేసి టి‌డి‌పితో కలిసే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. మరి పవన్ పొత్తుపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version