కంపెనీ ఇంటే ఇదేరా.. లేఆఫ్‌ సీజన్‌లో కూడా ఒక్కో ఉద్యోగికి 3.5 లక్షల బోనస్‌..!!

-

ఆర్థిక మాంద్యం దెబ్బకు.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలన్నీ కుదేలైపోయాయి.. దిగ్గజ సంస్థలు సైతం.. ఉద్యోగులని ఇంటికి పంపించేశాయి. ఇంకో నెలలో హైక్స్‌ వస్తాయి.. ఉద్యోగస్థులంతా.. శాలరీ పెరుగుతుందని ఉత్సాహంగా ఉంటారు.. కానీ కరోనా వల్ల..జాబ్‌లు పోయి.. కొత్త ఉద్యోగాల కోసం..వేట మొదలేశారు.. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో.. ఓ కంపెనీ ఉద్యోగులకు.. ఏకంగా రూ.3.5 లక్షల బోనస్ ప్రకటించింది. ఆశ్చర్యంగా ఉంది కదా..!ఫ్రెంచ్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్ హెర్మెస్ తమ ఉద్యోగులకు వన్ టైమ్ ఇయర్ ఎండ్ బోనస్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 19,700 మంది ఉద్యోగులకు సాలరీ బోనస్ ప్రకటించింది. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఒక్కొక్కరికీ 4,000 యూరోలు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.3.5 లక్షల్ని బోనస్‌గా ప్రకటించింది..
వారికి ఫిబ్రవరి చివరి నాటికి బోనస్ లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు పెరగడంతో ఈ కంపెనీకి లాభాలు కూడా పెరిగాయి. దీంతో తమ ఉద్యోగులకు బోనస్ ఇచ్చి సంతోషపరుస్తోంది కంపెనీ.బోనస్ మాత్రమే కాదు, ఉద్యోగులకు 6 శాతం వేతనం కూడా పెంచుతున్నట్టు సదరు కంపెనీ ప్రకటించింది. అబ్బా.. ఆ కంపెనీ ఉద్యోగులకు పండగే.. ఉద్యోగులకు 100 యూరోలు అంటే రూ.8,700 చొప్పున వేతనం పెరుగుతుంది. గతేడాది జనవరిలో, జూలైలో రెండుసార్లు వేతనాన్ని పెంచింది కంపెనీ.
హెర్మెస్ లగ్జరీ గూడ్స్ తయారు చేసి అమ్మే కంపెనీ. లెదర్ వస్తువులు, ఫ్యాషన్ యాక్సెసరీస్, లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ ప్రత్యేకత. ఫ్రాన్స్‌లో 12,400 హెర్మెస్ ఉద్యోగులకు లాభాల్లో వాటా, ప్రోత్సాహక బోనస్‌లతో సహా 17 నెలల జీతంతో సమానంగా లభిస్తుందని సీఈఓ ఏక్సెల్ డుమాస్ అనలిస్టుల సమావేశంలో తెలిపారు.
ఈ బోనస్ చెల్లింపు వ్యాల్యూ షేరింగ్ విధానంలో భాగమని, వాటాదారులకు కూడా డివిడెండ్ పెరుగుదల ఉంటుందని కంపెనీ పేర్కొంది. 2022 లో 11.6 బిలియన్ డాలర్ల అమ్మకాలకు జరిపింది. 2021 అమ్మకాల కన్నా 23 శాతం ఎక్కువ సంపాదించింది. లూయిస్ విట్టన్, ఛానెల్ తర్వాత హెర్మెస్ మూడో అతిపెద్ద లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌గా స్థానాన్ని సంపాదించింది. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన హెర్మెస్ ఒక్క ఏడాదిలో 2,100 ఉద్యోగాలను నియమించుకుంది. అందులో 1,400 ఉద్యోగాలు ఫ్రాన్స్‌లోనే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version