వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే మంచి కలుగుతుంది. ఏ విధమైన సమస్యలు అయినా సరే వాస్తు తో తొలగించుకోవచ్చు. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే చెడు కలుగుతుంది. అదే విధంగా ఆనందం లేకుండా తరచూ సమస్యలు ఉంటాయి. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటారు.
హిందువులు ప్రతిరోజూ తులసి మొక్క కి పూజ చేసి కొలుస్తారు. ఆర్థిక సమస్యలను తొలగించడానికి ఇది మనకి బాగా ఉపయోగ పడుతుంది. అయితే ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు. అలానే ఎప్పుడు కూడా ఈ మొక్క పక్కన ముళ్ళ ముక్కలను పెట్టొద్దు. అమావాస్య, ద్వాదశి మరియు చతుర్దశి నాడు తులసి దళాలను తుంచకూడదు.
తులసి మొక్క కి ఆదివారం పూట నీళ్ళు పోస్తే మంచిది కాదు. అలానే ఆకులను కోయకూడదు. గోర్లతో తులసి దళాలను తుంచకూడదు. అదే విధంగా తులసి మొక్క ఎండిపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఎండిపోయిన తులసి మొక్కని అసలు వుంచద్దు. విఘ్నేశ్వరునికి పూజించేటప్పుడు తులసి దళాలని ఉపయోగించకండి. ఇలా మీ ఇంట్లో తులసి మొక్క విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే సమస్యలు వస్తాయి అని తెలుసుకోండి.