హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ సోదాల కలకలం

-

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు మళ్లీ అలజడి రేపుతున్నాయి. రాజకీయ ప్రతినిధులు, వ్యాపారులు ఇలా ఐటీ అధికారులు ఎవరినీ వదలడం లేదు.  తాజాగా హైదరాబాద్​లోని పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాలానగర్​లోని రసాయన పరిశ్రమలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. దిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

వారం రోజుల కిందట హైదరాబాద్‌లో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ సోదాలు కలకలంరేపాయి. 20 బృందాలుగా ఏర్పడిన 60మంది ఐటీ అధికారులు.. ఏకకాలంలో వివిధ చోట్ల దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎక్సెల్‌ గ్రూప్‌తో పాటు అనుబంధ సంస్థల్లో ఈ సోదాలు జరిగాయి.

గచ్చిబౌలి మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్‌ రబ్బర్‌ లిమిటెడ్‌ సంస్థలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇన్‌ఫ్రా, ఐటీ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను ఎక్సెల్‌ గ్రూప్‌ నడుపుతోంది. అలాగే.. బాచుపల్లి, చందానగర్‌, కోకాపేట, బాబుఖాన్ లేక్ ఫ్రంట్ విల్లాస్‌లోని అనుబంధ సంస్థల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సంస్థ ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరపటం చర్చనీయంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version