ఇటలీ: 23 ఏళ్ల ఇటాలియన్ మహిళ టుస్కానీలోని ఓ ఆసుపత్రిలో వైద్యుల బృందం ఆధ్వర్యంలో అబ్జర్వేషన్‌లో ఉన్నారు. ఆమెకు నర్సు ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే అది ఇంజెక్షన్ కాదని.. ఆరు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ అని తెలిసింది. దీంతో వ్సాక్సిన్ తీసుకున్న మహిళను ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పారాసిటమల్‌తో పాటు ప్లూయిడ్స్ ఇచ్చారు. ఈ ఘటనను ఏజీఐ అనే న్యూస్ ఏజెన్సీ వెలుగులోకి తీసుకొచ్చింది.
కాగా నాలుగు డోసులకంటే ఎక్కువ వేసుకోకూడదని ఫైజర్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 90 దేశాల్లో ఫైజర్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. త్వరలో సింగపూర్‌లో ఫైజర్ వ్యాక్సిన్ ఉత్పత్తి తయారీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.