మునుగోడు కారులో జగదీశ్ వన్ మ్యాన్ షో..!

-

మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలిసి తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ పనిచేస్తుంది…ఇప్పటికే బీజేపీ చేతిలో దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ చావుదెబ్బతింది. ఇక ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో కూడా టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ చూస్తుంది. ఇప్పుడు బీజేపీ చేతిలో మళ్ళీ ఓడితే టీఆర్ఎస్ పార్టీ పరిస్తితి ఘోరంగా తయారవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు ఇంకా దూరమవుతుంది. అందుకే ఎలాగైనా మునుగోడులో సత్తా చాటి తీరాలని చెప్పి టీఆర్ఎస్ చూస్తుంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్ సభ జరిగింది…అలాగే రాష్ట్ర స్థాయి నేతలు మునుగోడులో ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే మునుగోడులో పార్టీ గెలుపు బాధ్యతలని మంత్రి జగదీశ్ రెడ్డి తీసుకున్నారు. మొత్తం తానే చూసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్దిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫిక్స్ అని తెలుస్తోంది. కూసుకుంట్లని వెంటపెట్టుకుని జగదీశ్ నియోజకవర్గం మొత్తం తిరిగేస్తున్నారు.

గ్రామం గ్రామం తిరుగుతూ ప్రజలని కలుస్తూ..టీఆర్ఎస్ పార్టీని గెల్పించాలని కోరుతున్నారు. అయితే మొత్తం బాధ్యతలని భుజాన వేసుకున్న జగదీశ్ రెడ్డి…మునుగోడులో వన్ మ్యాన్ షో నడిపిస్తున్నారని తెలుస్తోంది. మొత్తం తన చేతుల మీదుగానే జరగాలనే పాలసీతో ముందుకెళుతున్నారు. దీని వల్ల పార్టీలో అంతర్గత విభేదాలు వస్తున్నాయి. జగదీశ్ మరీ ఒంటెద్దు పోకడతో ముందుకెళుతున్నారని, తమని కలుపుకుని పనిచేయడం లేదని నియోజకవర్గంలోని బీసీ నేతలు ఫైర్ అవుతున్నారు.

ఇప్పటికే సీటు కోసం ట్రై చేసిన కర్నె ప్రభాకర్‌‌ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలిసింది. అలాగే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సైతం..జగదీశ్ వైఖరిపై ఫైర్ అయ్యారు. పార్టీ చేపట్టే కార్యక్రమాలపై తనకు కనీస సమాచారం ఇవ్వడంలేదని, బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉన్న జగదీశ్‌రెడ్డికి కామన్‌సెన్స్‌ లేదా?అని నర్సయ్య ఫైర్ అయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారని, అలాంటిది బీసీ నేతలనే జగదీశ్ పట్టించుకోవడం లేదని నర్సయ్య విమర్శిస్తున్నారు.

మునుగోడులో బీసీ నేతలు ఇదే వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది..పైగా కూసుకుంట్లని అభ్యర్ధిగా పెట్టొద్దని చాలామంది కోరారు..అయినా సరే ఆయన్నే అభ్యర్ధిగా ముందు తీసుకెళుతున్నారు. టీఆర్ఎస్ లో జరుగుతున్న ఈ పరిణామాలు…మునుగోడులో ఆ పార్టీకే ఇబ్బందిగా మరే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news