ఇప్పటివరకు జగన్..కేవలం సీఎం పాత్ర పోషిస్తూ వచ్చారు…కానీ ఇకపై వైసీపీ అధినేత పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారు. ఇక నుంచైనా అధినేత పాత్ర పోషించకపోతే వైసీపీ బాగా కష్టాల్లో పడేలా ఉంది…అందుకే జగన్ అలెర్ట్ అయ్యారు..పూర్తిగా తన సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నారు…2019 ఎన్నికల ముందు పోషించిన పాత్రని మరోసారి పోషించనున్నారు. 2019 ముందు జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు కంటే వైసీపీ అధినేతగానే జగన్ ఎక్కువ కనిపించారు…మళ్ళీ పార్టీని బలోపేతం చేయడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశారు. ఏడాది పాటు పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నారు..దీంతో ప్రజలు పూర్తిగా జగన్ వైపుకు వచ్చారు…అందుకే 2019 ఎన్నికల్లో జగన్ భారీ విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చారు.
అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా రాజకీయం ఉంటుంది…ఎందుకంటే సీఎంగా జగన్ బాగోగులని చూసుకోవాలి…దాని వల్ల పార్టీకి ఎక్కువ సమయం కేటాయించడం కుదరదు. వాస్తవానికి చెప్పాలంటే ఈ మూడేళ్లలో జగన్…పెద్దగా పార్టీ కోసం సమయం కేటాయించలేదనే చెప్పాలి..అలాగే మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని పార్టీని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి…కేవలం కార్యకర్తలే పార్టీ కోసం ఇంకా కష్టపడుతూ వస్తున్నారు.
ఇలా పార్టీకి అధినేత జగన్ ఎక్కువ సమయం కేటాయించకపోవడం వల్ల…కాస్త వైసీపీ వీక్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది..పైగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రోజురోజుకూ పుంజుకుంటుంది…చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా ప్రజల్లోనే ఉంటున్నారు…దీని వల్ల టీడీపీకి అడ్వాంటేజ్ పెరుగుతుంది…కానీ జగన్ సీఎం అయ్యాక పార్టీ వైపు పెద్దగా చూడలేదు.
దీని వల్ల వైసీపీకి ఇబ్బందులు మొదలయ్యాయి..ఇక ఆ ఇబ్బందులు తొలగించి, మళ్ళీ పార్టీని గాడిలో పెట్టేందుకు జగన్…అధినేత అవతారం ఎత్తనున్నారు…జూలై 8,9 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశం పెట్టి..పార్టీకి మళ్ళీ కొత్త ఊపు తీసుకురానున్నారు…మాహానాడు కంటే భారీగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించి, ప్రజల్లో తన బలం తగ్గలేదని నిరూపించుకోవాలని చూస్తున్నారు. అలాగే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు కూడా చెక్ పెట్టనున్నారు…మొత్తానికి ప్లీనరీ సమావేశాల నుంచి జగన్ అధినేతగా మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయనున్నారని చెప్పొచ్చు.