నేడు ఢిల్లీకి ఎపీ సీఎం జగన్.. కేంద్ర మంత్రులతో చర్చ

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, నేడు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు అంశాల మీద కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ముచ్చటించనున్నారు. ముఖ్యంగా పోలవరం ఇరిగేషన్ విషయమై చర్చలు ఉండనున్నాయని తెలుస్తుంది. గోదావరి నది మీద నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించనున్నారు. ఇదే కాదు ఇంకా రాష్ట్రంలో పలు అంశాల మీద కేంద్ర మంత్రులతో డిస్కస్ చేయనున్నారని తెలుస్తుంది.

ప్రధానమంతి ఆవాస్ యోజన విషయంలో రాష్ట్రానికి చేకూరాల్సిన ప్రయోజనాల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేఖ రాసారు. గడిచిన ఏడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3కోట్ల ఇండ్ల నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ 18ఏళ్ళు పైబడ్డ వారందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడం జాతీయ ఎజెండా అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version