ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులతో ఆడుకుంటున్నారని అన్నారు ఏపి బి.జె.పి.జాతీయ కార్యదర్శి సత్య కుమార్. ఎన్నికలలో ఇచ్చిన హామీ లను జగన్ తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. కేంద్ర పథకాలకు తన పేరు వేసుకుని ప్రచారం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏటా జాబ్ క్యాలండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని పాదయాత్ర లో జగన్ హామీ ఇచ్చారని.. కానీ గత మూడేళ్ళ నుంచి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు సత్య కుమార్. చిత్తూరు, ప్రకాశం జిల్లా లలో లక్షలాది మందికి ఉపాధిని కల్పించే నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ మనుఫ్యాక్చరింగ్ జోన్ లకు స్థలం కేటాయించలేదని మండిపడ్డారు.కేంద్రం రాష్ట్రానికి 25 విద్యా సంస్థలను కేటాయించిందన్నారు.రాష్ట్రంతో పాటు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా పారిశ్రామికాభివృద్ధి జరగడం లేదన్నారు.
స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి మూడేళ్లయినా ఒక ఇటుక కూడా పెట్టలేదన్నారు సత్య కుమార్.