అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తానని సీఎం జగన్ అన్నారు. ఇవాళ అంబేద్కర్ జయంతి ఉన్న నేపథ్యంలో… ఆయనకు నివాళులు అర్పించారు సీఎం జగన్. ఈ మేరకు ట్వీట్ చేశారు. దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్.
బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి అన్నారు. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్.
దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. 1/2 pic.twitter.com/Lt1TQ5711D
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2023