ఏపీ ప్రజలకు శుభవార్త. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కుపై జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రెవిన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలసుకున్న సీఎం జగన్.. మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. అలాగే ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం పరికరాలు ఉండాలన్న సీఎం జగన్… రోవర్ తరహా… పరికరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలని కోరారు.
దీనివల్ల సర్వేయర్ పూర్తిస్ధాయిలో తన పనిని పూర్తిచేసుకునే అవకాశం ఉంటుందన్న సీఎం జగన్… అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలపై ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు. తర్వాత దశల్లో జరిగే సర్వే ప్రక్రియ కోసం రాళ్ల కొరత రాకుండా ముందస్తుగానే సన్నాహాలు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ప్రాంతాల్లో చేయాల్సిన సర్వేకోసం సన్నాహాలు చేసుకుంటున్నామన్న మున్సిపల్ శాఖ అధికారులు… దీనికి సంబంధించి డేటా క్రోడీకరణ జరుగుతుందని తెలిపారు. నిర్దేశించుకున్న టైం లైన్స్ ప్రకారం కచ్చితంగా సర్వే ప్రాంతాల్లో పూర్తిచేయాలని జగన్ ఆదేశించారు.