కూతుర్ల పెళ్లిళ్ల పై సెన్సేషన్ కామెంట్స్ చేసిన జగపతిబాబు..!

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలామంది నట వారసులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి వారిలో ప్రముఖ డైరెక్టర్ విబి రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబు కూడా ఒకరు. కెరియర్ సక్సెస్ బాటలో సాగినప్పటికీ తర్వాత వరుస ఫ్లాప్ లతో సతమతమయ్యారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా శోభన్ బాబుకు ఎంత మంచి పేరు ఉందో.. ఆ తర్వాత నటుడు జగపతిబాబుకి కూడా అంతే పేరు ఉందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన జగపతిబాబు జీవితం ఏమి పూలబాట కాదు.. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు , ఒడుదుడుకులు కూడా ఉన్నాయి.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు. కానీ అంతగా సెట్ అవ్వలేదు. దాంతో కుటుంబ చిత్రాలకి పరిమితమయ్యాడు. ప్రస్తుతం విలన్ గా నటిస్తూ దూసుకుపోతున్నాడు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు తన కూతుర్ల పెళ్లిళ్లపై సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.. నా కుటుంబం విషయానికి వస్తే నాకు ఇద్దరు కూతుర్లు.. చిన్నప్పటినుంచి చాలా గారాబంగా పెరిగారు పెద్దమ్మాయి ఒక అమెరికన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

చిన్నమ్మాయికి పెళ్లి వద్దని చెప్పాను. నీకు అన్ని విధాలుగా సెట్ అయ్యేవాడు.. నిన్ను బాగా చూసుకునే భాగస్వామిని నువ్వే వెతికి చేసుకో అన్నాను. నాకు తెలిసి పెళ్లి పిల్లలు అంటూ బాధ్యతలు తీర్చుకోవడానికి వారి వెంట పడడం కరెక్ట్ కాదు.. అందుకే నా పిల్లల విషయంలో స్వేచ్ఛనిచ్చాను.. నా కుటుంబం నా పిల్లలు అంతా సంతోషంగా ఉన్నారు అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version