“ముత్యాల ముగ్గు” సినిమాలో హీరోయిన్ పరిస్థితి నాది : రేవంత్ పై జగ్గా రెడ్డి ఫైర్

-

రేవంత్‌ రెడ్డి పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పై రేవంత్‌ రెడ్డి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్యాల ముగ్గు సినిమా లో హీరోయిన్ టైపు తన పరిస్థితి అయిందని.. నేను హీరోయిన్.. హీరో కాంగ్రెస్ పార్టీ .. విలన్ రేవంత్ రెడ్డీ అంటూ ఫైర్‌ అయ్యారు. తాను కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నానని.. జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాని చెప్పారు.

నేను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా.. పార్టీలో ఉంటున్నానని.. నా మనసు నన్ను నచ్చితే చాలు అని..చెప్పారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ లో ఉన్న మజా ఇంకో పార్టీలో ఉండదని.. రేవంత్ పై బురద జల్లే అవసరం తనకు లేదన్నారు. ఇలాంటి అవకాశం కల్పించింది కూడా రేవంతేనని పేర్కొన్నారు. తనతో రేవంత్ వ్యవహరించిన తీరు కరెక్ట్ నా..? జగ్గారెడ్డికే ఇలా జరిగితే.. మిగిలిన వాళ్లకు ఏం చేస్తారని ఫైర్‌ అయ్యారు. ఎవరికి టికెట్ ఇస్తారు..ఏమౌతుంది అని అనుమానంగా ఉందని.. ఇప్పుడు నాకు శీల పరీక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news