తెలంగాణ రైతులపై సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రైతులను పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఇతర రాష్ట్రాల రైతుల సమస్యలు పట్టించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సొంత రాష్ట్రాన్నే పట్టించుకోని సీఎం.. వేరే రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. రైతుల సమస్యలపై చర్చించడం గమనార్హమన్నారు. రాజకీయాల కోసం పక్క రాష్ట్రాలకు పోతున్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు.
మంగళవారం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు పదే పదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారన్నారు. 8 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. మొదటి సంతకం ఉచిత విద్యుత్‌పైనే పెట్టారన్నారు. మొదటగా ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెసేనని అన్నారు. అదే కాన్సెప్ట్ ను టీఆర్ఎస్ కొనసాగిస్తోందన్నారు.