జమ్మూ కాశ్మీర్ లో వరస ఎన్ కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. నిన్న రెండు వేరువేరు ఎన్ కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈఘటన మరవకు ముందే గురువారం అర్ధరాత్రి మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. శ్రీనగర్‌లోని పాంథా చౌక్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్క సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అవ్వగా.. నలుగురు జవాన్లు గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్ఫీఎఫ్ బలగాలు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
ఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒకరిని సుహేల్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అతనికి జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిన్న వరసగా జరిగిన ఎన్ కౌంటర్లలో మొత్తం తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి.