టీడీపీతో పొత్తు..సీమలో జనసేనకు తక్కువే..!

-

టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమైందనే చెప్పవచ్చు..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి రంగంలోకి దిగుతున్నాయి. వైసీపీని చెక్ పెట్టడానికి ఓట్లు చీలిపోకుండా రెండు పార్టీలు కలుస్తున్నాయి. అయితే అధికారికంగా పొత్తుపై క్లారిటీ రాలేదు గాని..అనధికారికంగా మాత్రం రెండు పార్టీల వర్గాలకు పొత్తుకు సంబంధించిన సమాచారం చేరింది. దీంతో కొందరు టీడీపీ నేతలు జనసేన కోసం సీట్ల త్యాగానికి రెడీ అవుతున్నారు. అయితే జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇవ్వాలని అనుకుంటుంది..ఇటు జనసేన ఎన్ని సీట్లు కావాలని డిమాండ్ చేస్తుందనేది ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు.

 

అయితే లేటెస్ట్ గా సీట్ల షేరింగ్ పై మాత్రం కథనాలు వస్తున్నాయి. ఇక జనసేన ఎక్కువ శాతం సీట్లు విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కాస్త ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రాయలసీమలో ఎక్కువ సీట్లు జనసేన ఆశించడం లేదు. ఎందుకంటే అక్కడ జనసేనకు పట్టు తక్కువ..గత ఎన్నికల్లో పదివేల పైనే ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు రెండు, మూడు మాత్రమే ఉన్నాయి. అంటే సీమలో జనసేన ప్రభావం పెద్దగా లేదు.

అందుకే అక్కడ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం లేదని తెలుస్తోంది. సీమలో ఉమ్మడి జిల్లాలు నాలుగు ఉన్నాయి..మొత్తం 52 సీట్లు ఉన్నాయి. వాటిల్లో 8-10 సీట్ల వరకు మాత్రమే ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు, తిరుప‌తి, మైదుకూరు, రాజంపేట‌, అనంత‌పురం, గుంత‌క‌ల్లు, కర్నూలు సిటీ, ఆళ్లగడ్డ లేదా నంద్యాలలో ఏదొకటి..ఈ సీట్ల‌ను అడుగుతున్నార‌ని స‌మాచారం. ఈ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లిజల ఓట్లు ఎక్కువ‌. దీంతో జ‌న‌సేన‌కు టీడీపీ బ‌లం తోడైతే గెలుపు సులువుగా దక్కుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి జనసేనకు ఏ సీటు దక్కుతాయో.

Read more RELATED
Recommended to you

Latest news