నాకు న్యాయం చేయండి: కేఏ పాల్

-

పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి, అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి కుండ గుర్తుపై పోటీ చేసిన కేఏ పాల్‌కి షాక్ తగిలింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు.

తనకు న్యాయం చేయండంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. ‘దేశంలో జరిగినవి అత్యంత చెత్త ఎన్నికలు. నా వద్ద ఆధారాలు ఉన్నందుకే ఈ మాట అంటున్నా. విశాఖ ఎంపీగా పోటీ చేసిన నాకు వేల ఓట్లు వచ్చాయి. వాటినీ, నా ఫ్యామిలీ ఓట్లనూ అక్రమంగా టీడీపీ అభ్యర్థి భరత్కు మళ్లించారు. తన తండ్రితో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం 4 ఓట్లే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అంటూ సీజేఐని పాల్ కోరారు.ఇదిలా ఉంటే… ఏపీలో కూటమి లోక్సభ ,అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. వైసిపి మాత్రం భారీ విజయాన్ని మూట కట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version